7 March, 2026 | 2:24 AM

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

06-03-2026 06:30 PM

అల్లిపూర్ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని యువ నాయకుడు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయికిరణ్ అన్నారు. శుక్రవారం రేగడి మద్దికుంట హైస్కూల్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా  పరీక్ష ప్యాడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న  సర్పంచ్ కోదాటి సాయికిరణ్ మాట్లాడుతూ  ఇప్పుడున్న రోజులలో ప్రవేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ పాఠశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే సుల్తానాబాద్ మండలంలో నిరుపేదలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు.

ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరంల గానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు దాతల సహకారంతోమా సొంత డబ్బులతోటి పరీక్ష ప్యాడ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. నేడు  సుల్తానాబాద్ లోని ఎంజెబిఎస్ గర్ల్స్ రెసిడెన్షియల్ మరియు మండలంలోని నారాయణపూర్ హై స్కూల్, రేగడి మద్దికుంట హై స్కూల్, కనుకుల హై స్కూల్, తొగర్రాయి హై స్కూల్ లలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించడం జరిగినది.