18 July, 2026 | 12:54 AM

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు నమోదు పెంచాలి

18-07-2026 12:36 AM

కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, జూలై 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కేజీబీవీ, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నమోదు, ఏకరూప దుస్తు ల పంపిణీ, తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటుపై ప్రతిపాదనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చల్లగరిగ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించా రు.

సమావేశానికి గైర్హాజరైన సంబంధిత అ ధికారులపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. 5 నుండి 8వ తరగతుల విద్యార్థుల డ్రాపౌట్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని తిరిగి పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ మోడ ల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏకరూప దుస్తుల కుట్టు పనులు చేపడుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలను అభినందిస్తూ, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.