21 August, 2026 | 10:23 PM

కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం

21-08-2026 09:34 PM

ఉరి వేసుకుని ఆత్మహత్య

పాపన్నపేట: కడుపునొప్పితో బాధపడుతూ ఉరి వేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వగ్గు రిషిత(14) మండలంలోని యూసుఫ్ పేట ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. తరచూ కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది.

పలుమార్లు హాస్పిటల్ లలో వైద్యం చేయించినా కడుపునొప్పి తగ్గడం లేదు. శుక్రవారం ఉదయం సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లో దిగులుగా ఉంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తరువాత గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.