అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే
ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని కమలాపురం గ్రామంలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర మన ఎమ్మెల్యే - మన బడి అనే నూతన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కమలాపురం గ్రామంలోని ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా నూతన బోరువెల్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందించే బోధన, తరగతి గదుల నిర్వహణ,మౌలిక వసతులను నిశితంగా పరిశీలించారు.విద్యార్థులతో కలిసి కూర్చుని వారికి స్వయంగా భోజనం వడ్డించారు వారితో కలిసి భోజనం చేశారు.గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.






