21 August, 2026 | 11:11 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి

21-08-2026 10:01 PM

- కాంగ్రెస్ పార్టీ నేత పైడాకుల కృష్ణమూర్తి 

- చల్వాయి కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

గోవిందరావుపేట,(విజయక్రాంతి): రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సిన పూర్తి బాధ్యత గ్రామ కమిటీల మీద ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత పైడాకుల కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని చల్వాయి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా వేల్పుగొండ ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా బండమీది అశోక్ లను ఎన్నుకోవడం జరిగింది. చలువాయి గ్రామ కమిటీ ఇన్చార్జులుగా కనతల నాగేంద్రరావు, జెట్టి సోమయ్య, రాష్ట్ర నాయకులు పైడాకుల కృష్ణమూర్తి, క్లస్టర్ ఇన్చార్జిలు తేళ్ల హరిప్రసాద్, జంపాల ప్రభాకర్, గ్రామ సర్పంచ్ మేకల రాధా సుదర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ కుమార్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు చాపల ఉమాదేవి నరేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా పీరీల శీను, చిక్కుల వెంకటేష్, పాతూరి జగన్ మోహన్ రావు, నూతన కమిటీ తదితరులు పాల్గొనడం జరిగింది.