1 July, 2026 | 7:45 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

స్థానిక ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టాలి

08-10-2025 12:00 AM

కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 7, (విజయక్రాంతి):త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎ న్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్, సబ్ డివిజన్లోని ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది  పా ల్గొన్నారు.సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.భాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం డిఎస్పి కార్యాలయ పరిసరాలను పరిశీలించి,అక్కడ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.