22 May, 2026 | 3:58 PM

గంజాయి, మత్తు పదార్థాలు సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు

22-05-2026 03:03 PM

బస్టాండు, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలను డాగ్స్ స్కార్డుతో తనిఖీలు

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఏ ఒక్కరు గంజాయి మత్తు పదార్థాలను సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సిఐ పొన్నమనేని రంజిత్ రావు హెచ్చరించారు. శుక్రవారం సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలలో తో పాటు రద్దీగా ఉండే ప్రదేశాలలో నార్కోటిక్ బృందం సుల్తానాబాద్ పోలీసులు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్స్ స్వీపర్ డాగ్ స్కాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన అనంతరం సీఐ మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గంజాయి మత్తు పదార్థాలు సేవించిన విక్రయించిన రవాణా చేపట్టిన తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటిని ఎవరు సేవించవద్దని వాటికి దూరంగా ఉండాలని నిబంధనలు అధికమించి విక్రయించిన సేవించిన వివిధ పరీక్షల ద్వారా వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని ఎట్టి పరిస్థితిలో ఎవరిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.

రైస్ మిల్లు ఇటు కబట్టి యజమానులు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అలాగే తమ ఇండస్ట్రియల్ లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి గుర్తింపు కార్డులను విధిగా సేకరించాలని వారి పూర్తి సమాచారం యాజమాన్యం వద్ద ఉండాలని సూచించారు. ఇండస్ట్రియల్ లో పనిచేసే మహిళలు చిన్నపిల్లల ను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

మిల్లులు, ఇటుక బట్టి లా పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎవరైనా గంజాయి మొక్కలను పెంచితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలందరూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు. తనిఖీలలో ఎస్సై చంద్రకుమార్, మూడవ ఎస్సై అశోక్ రెడ్డి, నార్కోటిక్, డాగ్ స్క్వాడ్ బృందం తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.