చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
ముత్తారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్
ముత్తారం,(విజయక్రాంతి) చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ముత్తారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏసిపి రమేష్ విచారణ చేపట్టారు. తీసుకు సంబంధించిన సాక్షులను విచారించారు.
ప్రజలు గొడవలకు పోకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి గాని ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. చట్టం తన పని తాను తీసుకుపోతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసిపి హెచ్చరించారు. ఏసీపీ వెంట మంథని సిఐ రాజు, ముత్తారం ఎస్ఐ రవికుమార్ ఉన్నారు.




