18 July, 2026 | 1:10 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

30-05-2026 12:21 AM

మహబూబాబాద్, మే 29 (విజయక్రాంతి): అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తనాల విక్రయాల్లో ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని విత్తన విక్రయ షాపుల యజమానులకు అధికారులు సూచించారు.

టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరిపెడలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరిపెడ ఎస్త్స్ర సతీష్ మాట్లాడుతూ లైసెన్స్ పొందిన షాపులు మాత్రమే విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అదేవిధంగా విత్తనాలు ఖరీదు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. జూన్ 1 నుండి ప్రతివారం షాపులను విధిగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏవో వీరా సింగ్, అసోసియేషన్ అధ్యక్షులు కాలం శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల కృష్ణమూర్తి, చల్లారిష్, సురేందర్, రమేష్ రెడ్డి, గుండ్రాల ప్రసాద్, మాణిక్యం, అంబరీష తదితరులు పాల్గొన్నారు.