18 July, 2026 | 12:50 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

అభివృద్ధిపై రైల్వే అధికారులతో సమీక్ష

30-05-2026 12:20 AM

మేడ్చల్, మే 29(విజయక్రాంతి): మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  రైల్వే ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి, విద్యుత్ సరఫరా సంబంధిత అంశాలపై అధికారులతో  చర్చించారు.

ముఖ్యంగా విద్యుత్ వైర్లను అండర్గ్రౌండ్లోకి మార్చే పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.  విద్యుత్ శాఖల మధ్య సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురుగేష్, సిద్ధిరాములు, నర్సింగ్ రావు, నరహరి తదితరులు పాల్గొన్నారు.