6 June, 2026 | 9:34 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం

06-06-2026 08:39 PM

జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా: కాప్రా తాసిల్దార్ మతిన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు భూముల పరిరక్షయే ధ్యేయంగా పనిచేస్తామని జవహర్ నగర్ లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కబ్జాదారులపై ప్రత్యేక నజరు పెడుతున్నామని కాప్రా తాసిల్దార్ మతిన్  హెచ్చరించారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు శనివారం గిరధవార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను కాపాడుతామని పేద ప్రజలు ప్రభుత్వ భూములు కొని మోసపోవద్దని సూచించారు. వికలాంగుల కాలనీ, మోహన్ రావు కాలనీ, సంతోష్ నగర్ ,డెంటల్ కాలేజీ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.