6 June, 2026 | 9:52 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

35 ఏళ్ల సుదీర్ఘ సేవలు అమోఘం

06-06-2026 08:42 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): పోలీసు శాఖలో హోంగార్డుగా చేరి, 35 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందించిన నాగిని రాజేందర్ పదవీ విరమణ సందర్భంగా శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై, రాజేందర్ ‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, కమీషనరేట్ కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించిన నాగిని రాజేందర్, తన 35 ఏళ్ల సర్వీసులో ఎంతో అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పోలీసు శాఖలో హోంగార్డుల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో వారు అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

పదవీ విరమణ పొందిన రాజేందర్ శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమక్షంలో నాగిని రాజేందర్ ‌కు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. తన సర్వీసు కాలంలో తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ, విధుల్లో క్రమశిక్షణ పాటించిన ఆయనను పలువురు అధికారులు అభినందించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (హోంగార్డ్స్) శ్రీధర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవి మరియు కమిషనరేట్‌కు చెందిన ఇతర పోలీసు అధికారులు, హోంగార్డు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.