11 April, 2026 | 1:37 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

గుర్తుంచుకునేందుకు గుడి కట్టారు!?

04-10-2025 09:02 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): కని పెంచి పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తండ్రి అకాల మృత్యువాత పడగా కొడుకులు, కూతురు కలిసి  నిత్యం గుర్తుండే విధంగా తండ్రికి గుడి కట్టి అందులో ఆయన శిలా విగ్రహం ఏర్పాటు చేసి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలో జరిగింది. కేసముద్రం పట్టణానికి చెందిన నర్సింగం రాజలింగం గత ఏడాది చనిపోయారు. శనివారం ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు మల్లేష్, వెంకటేష్, కూతురు అల్లుడు హైమ రమేష్, భార్య ఐలమ్మ ఆధ్వర్యంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద గుడి కట్టి అందులో విగ్రహం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.