సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత
11-04-2026 12:06 PM
సర్పంచ్ బెండరే కృష్ణాజి
వాంకిడి, (విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్ బెండరే కృష్ణాజి ముందుచూపుతో చర్యలు చేపట్టారు. శనివారం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామం లోని బోరు మరమ్మత్తు పను లు నిర్వహించి, ప్రజలకు నీటి సరఫరా అంతరాయం కలగ కుండా చూసుకున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే సమస్యలను గుర్తించి పరిష్కరించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ప్రతి ఇంటికి తగినంత తాగునీరు అందేలా అవసరమైన ఏర్పా ట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలి పారు. ప్రజలు కూడా నీటిని ఆదా చేస్తూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమం లో గ్రామ పెద్దలు, వార్డు సభ్యు లు,స్థానికులు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.




