8 March, 2026 | 2:00 AM

విత్తన దుకాణంలో స్టాక్ సీజ్

08-03-2026 12:10 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 7 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహ ట్రేడర్స్ వ్యవసాయ విత్తనాల దుకాణల షాపు యజమాన్యం ఇటీవల అధిక ధరలకు యూరియా బస్తాలను విక్రయించారు. రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఎల్లారెడ్డి ఏడీఏ సుధా మాధురి, స్థానిక ఏవో సాయికిరణ్‌తో కలిసి శనివారం తనిఖీ చేశారు.

షాపులో ఉన్న పొటాష్, ఆర్గానిక్ పొటాష్ ఫర్టిలైజర్ స్టాక్ సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం ఫర్టిలైజర్ దుకాణ యజమాన్యులు విత్తనాలను విక్రయించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.