8 March, 2026 | 3:41 AM

కొత్తగూడెంలో బుద్ధప్రకాష్ జ్యోతి

08-03-2026 12:09 AM

వీకే కోల్ మైన్స్ సందర్శన

కొత్తగూడెం, మార్చి 7 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  డా.బుద్ధప్రకాష్ జ్యోతి శనివారం కొత్తగూడెం ఏరియాలోని ఉపరితల, భూగర్భ గనుల లో పర్యటించారు. నూతనంగా అనుమతులు వచ్చి న వీకే కోల్ మైన్స్‌ను సందర్శించారు. వీకే కోల్ మైన్స్‌నందు మొదటిసారిగా ఉత్పత్తి అయిన బొగ్గు రవాణాను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం  వ్యూ పాయింట్ నుండి వీకే కోల్ మై న్స్ యొక్క భౌగోళిక స్థితిని,వికే సిఎం యొక్క ఉత్ప త్తి ఉత్పాదకత పనితీరు, భద్రతా చర్యలు, ఉత్పత్తి పరిస్థితులను, కార్మికుల పనితీరును, భద్రతా ప్ర మాణాలను తెలుసుకున్నారు.

గనులలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. కార్మికులు సురక్షితంగా పని చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సంస్థ అభివృద్ధికి పని చేయాలని చైర్మన్ పేర్కొన్నారు.