24 March, 2026 | 1:05 PM

పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

24-03-2026 12:00 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, మార్చి 23 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. సోమవారం కాగజ్‌నగర్ మండ లం ఈజ్గాం గ్రామంలోని శాంతినికేతన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు కూర్చునే సౌకర్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులను పరిశీలించారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని ఇన్విజిలేటర్లకు ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుం డా ధైర్యంగా పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు.అనంతరం జంబుగా  పెద్దబండ మధ్య రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించి అప్రోచ్ రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి 

ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిం చాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.

మిల్లింగ్ వేగవంతం చేయాలి

ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కె. హరిత రైస్ మిల్లర్లను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని సమయానికి మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యా న్ని సరఫరా చేయాలని సూచించారు. మిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించి నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలని తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.