8 August, 2026 | 3:48 AM

కరాటే పోటీల్లో స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ సత్తా

08-08-2026 12:00 AM

ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ గెలిచిన విద్యార్థులు

ఖమ్మం, ఆగస్టు 7(విజయక్రాంతి): ఖ మ్మం స్థానిక శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు సౌత్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్-2026 పోటీల్లో పాల్గొని అండర్-14 కుమిటే బాలుర విభాగంలో టి.రోహిత్ (బంగారు పతకం), కె.కౌషిక్ గౌడ్ (కాంస్య పతకం), అండర్-12 కుమిటే బాలుర విభాగంలో యస్.కె.ఊబెద్ (బంగారు పతకం), అండర్-12 కటా బాలుర విభాగంలో ఎన్.పృథ్విరా జ్ (కాంస్య పతకం), ఈ. సంజయ్ (రజత పతకం), అండర్-10 కటా బాలుర విభాగం లో ఎన్.మహద్యుత్ సాయి (కాంస్య పతకం)తో పాటు ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని స్టెమ్‌స్పార్స్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు వారి అత్యుత్తమ ప్రదర్శనతో కైవసం చేసుకున్నారు.

స్కూల్‌లోజరిగిన అ భినందన సభలో పాఠశాల డైరెక్టర్స్ కె.శ్రీధర్‌రావు, కృష్ణవేణి ట్రోఫి, పతకాలు సాధిం చిన విద్యార్థులను అభినందించి ఆశీర్వదించారు, 14, 12, 10 సంవత్సరాల వయస్సు లోనే కరాటేలో సౌత్ ఇండియా, ఆసియా ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీల విజేతలు కావడం గొప్ప విశేషమన్నారు.

తమ పాఠశాలలో ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత ప్ర ణాళికలను అమలుపరుస్తున్నందున అన్ని రంగాలలో వారు సర్వతోముఖాభివృద్ది చెం ది అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రి న్సిపాల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సి బ్బంది తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.