14 March, 2026 | 9:57 PM

17,18 జరిగే రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్

14-03-2026 07:53 PM

- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఈనెల 17, 18 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ పిలుపునిచ్చారు. శనివారం ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ లో విశ్వవిద్యాలయ సమస్యలపై చర్చలు జరుగుతాయని, వాటి అభివృద్ధి కొరకు కార్యచరణను సిద్ధం చేసే విధంగా ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ నాయకులు శివ, మహేందర్, కళ్యాణ్, పవన్, సాయి, ఆకాష్, రాకేష్, విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.