22 April, 2026 | 2:30 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

దుర్గామాత దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి

01-10-2025 07:30 PM

కమాన్ పూర్ మండలంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు..

కమాన్ పూర్ (విజయక్రాంతి): దుర్గామాత దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని పలు దుర్గామాత విగ్రహాలను మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టం పల్లెలో హనుమాన్ దేవాలయం, చత్రపతి శివాజీ యూత్, సుభాష్ యూత్, ఆదర్శనగర్ దుర్గామాతలను దర్శించుకునారు. సముద్రాల వేణుగోపాల చారి మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించి అర్చన చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి దీవెన ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడు పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మండపాల నిర్వహకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.