18-02-2026 12:26:22 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అలాగే జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించడంతో.. ఉద్యోగులు సర్దుబాటు, ఆస్తుల పంపకాలపై చర్చించే అవకాశముంది.
దీంతో పాటు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్, గతంలో జరిగిన క్యాబినెట్ సమా వేశాల్లోని నిర్ణయాలు, పనుల పురోగతిపైన సమీక్ష జరుగవచ్చు. గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.