విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతతో విద్యుత్ శాఖ అధికారులకు అవస్థలు
లైన్మెన్ విధులు లైన్ ఇన్స్పెక్టర్ నిర్వహణ
తాండూర్ సబ్ స్టేషన్ లో సిబ్బంది కొరత లైనింగ్ ఇన్స్పెక్టర్ ఒక లైన్మెన్
తప్పని పరిస్థితుల్లో ఏఈ కూడా విద్యుత్ పనులు నిర్వహణ
విద్యుత్ సబ్ స్టేషన్ లో సిబ్బంది సమస్య
అదనపు పనిభారంతో అవస్థలు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): విద్యుత్‌శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్లుగా వివిధ పోస్టులు భర్తీకాకపోవడంతో ఉన్నవారితోనే వ్యవస్థను నెట్టుకొస్తున్నారు. అదనపు పని భారంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఒత్తిడి, అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బాధ్యత, రాగి తీగల మాయం వంటి సంఘటనలతో సస్పెన్షన్లు, అవినీతి ఆరోపణలతో ఏసీబీ దాడులు అధికారుల పనితీరుపై ఒత్తిడి పెంచుతున్నాయి. 29 లక్షలకు పైగా వ్యవసాయ మీటర్ల నిర్వహణ సవాలుగా మారింది.
విద్యుత్ శాఖ అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు
నిర్వహణ భారం: 29 లక్షలకు పైగా వ్యవసాయ, మిషన్ భగీరథ, డీటీఆర్ మీటర్ల నిర్వహణ క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సస్పెన్షన్లు & దాడులు: రాగి తీగల మాయం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల సస్పెన్షన్లు, ఏసీబీ దాడులు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సౌకర్యాల కొరత: ప్రాథమిక జాగ్రత్తలు పాటించకపోవడం, పాత ఫీడర్లతో తరచుగా విద్యుత్ సరఫరా అంతరాయం కలగడం వల్ల ప్రజల నుంచి ఒత్తిడి. పని ఒత్తిడి: ఏకకాలంలో మీటర్ల పర్యవేక్షణ, మెయింటెనెన్స్ పనుల వల్ల సిబ్బందికి విశ్రాంతి కరువవుతోంది.
నాగిరెడ్డిపేట, ఇంచార్జ్ విద్యుత్ ఏఈ నాగరాజు
నాగిరెడ్డిపేట మండలంలో 7 విద్యుత్ సబ్ షన్ లు ఉన్నాయని సిబ్బంది కాస్త అటు ఇటుగా ఉన్నారని ప్రస్తుతం నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న ఏడు సబ్ స్టేషన్లలో 16,500 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని ఇంచార్జ్ ఏ ఈ నాగరాజు తెలిపారు. సబ్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నదని సిబ్బంది సీనియర్ లైనింగ్ ఇన్స్పెక్టర్లు ఒకరు లైన్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు లైన్మెన్లు 6 సహాయక లైన్మెన్లు 6 ,ఏడు సబ్ స్టేషన్లలో 21 మంది ఆపరేటర్లు అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం 15 మందితో మాత్రం విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు ఇన్చార్జి ఏఈ నాగరాజు తెలిపారు. ప్రధానంగా తాండూర్ సబ్స్టేషన్ లో సిబ్బంది కొరత అధికంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాండూర్ గ్రామ సబ్ స్టేషన్ లో సిబ్బంది కొరత
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ మేజర్ మేజర్ పంచాయతీలో 16,500కు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు లైన్‌మెన్లు, ముగ్గురు ఆపరేటర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా, ఆపరేటర్ ఒకరు మాత్రమే ఉన్నారు. నలుగురు సహాయ లైన్మెన్లు అవసరం కాగా ఒక్కరు కూడా లేరు. సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు ఎనర్జీ అసిస్టెంట్లు అవసరం కాగా ఒక్కరూ లేని పరిస్థితి. దీంతో తాండూర్ విద్యుత్ సబ్స్టేషన్ లో, నిధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ పై అధిక భారం పడుతున్నప్పటికీ లైన్మెన్ ఒక్కరి సహాయంతో సబ్స్టేషన్ కొనసాగిస్తున్నారు. వేసవికాలం ప్రారంభమైనప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది.
రైతులు పంట పొలాలకు నీరు అవసరం ఉండడంతో విద్యుత్ అధికంగా వాడడంతో విద్యుత్ లైన్లు అక్కడక్కడ మొరాయించినప్పటికీ సమయానికి లైన్మెన్ సహాయలైన్మెంట్ విద్యుత్ శాఖ అధికారులు లేకపోవడంతో లైనింగ్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ నేరుగా ఓ ఆపరేటర్ గా సహాయ లైన్మెన్ గా మండుటెండలో తమ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనతోపాటు లైన్మెన్ నరసింహులు కూడా ఆ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సబ్స్టేషన్లో విద్యుత్ బిల్లులను వసూలు చేస్తూ మరోపక్క రైతులకు వచ్చిన విద్యుత్ సమస్యలను తీరుస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. సబ్ స్టేషన్ లో, లైన్ ఇన్స్పెక్టర్, ఇద్దరు లైన్మెన్లు, సుమారు ముగ్గురు ఆపరేటర్లు, ఇద్దరు సహాయ లైన్మెన్లు, అవసరం ఉన్నప్పటికీ కేవలం ఒక లైనిస్పెక్టర్ ఒక లైన్మెన్ ఒక సహాయ లైన్మెన్ ఒక ఆపరేటర్ తో విధులు నిర్వహిస్తున్నారు.
లైన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్
తాండూర్ సబ్ స్టేషన్ లో, సుమారు 1350 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని సిబ్బంది ముగ్గురు ఆపరేటర్లకు ఒకరే ఉన్నారని ఒక లైన్మెన్ ఒక సహాయ లైన్మెన్ ఉన్నారని సిబ్బంది కొరత అధికంగా ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ సమస్య వేసవి కాలమైనప్పటికీ విపరీతంగా ఏర్పడుతుందని సిబ్బంది లేక నేరుగా తననే విద్యుత్ సమస్య ఏర్పడ్డ చోట నేరుగా తనే వెళ్లి సమస్యను సాల్వ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనతోపాటు విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ నర్సింలు కూడా సహాయం చేస్తున్నారని తెలిపారు.




