14 March, 2026 | 6:53 PM

పదవ తరగతి పరీక్షలకు ఒకరు గైర్హాజరు

14-03-2026 05:04 PM

మొదటిరోజు ప్రశాంతంగా పది పరీక్షలు...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మొదటి రోజు శనివారం పదవ తరగతి పరీక్షలకు ఒకరు గైరాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. బాన్సువాడ మండలంలోని బొర్లంలో ఒకటి జడ్పీహెచ్ఎస్ పాఠశాల, బాన్సువాడ పట్టణంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నాలుగు పదో తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ నిర్వహించడం జరిగిందన్నారు. బోర్లం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 246 మంది విద్యార్థులకు గాను 245 మంది హాజరు కాగా ఒకరు గైరాజరైనట్లు ఆయన తెలిపారు.

బాన్సువాడ పట్టణంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో 226 మంది విద్యార్థులకు గాను 226 మంది విద్యార్థులు హాజరుకాగా, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 260 మంది విద్యార్థులకు గాను 260 మంది విద్యార్థులు హాజరు కాగా, జడ్పీహెచ్ఎస్ కోన బాన్సువాడ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు గాను 240 మంది విద్యార్థులు హాజరు కాగా, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 250 మంది విద్యార్థులకు గాను 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1222 మంది విద్యార్థులకు 1221 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకరు గైరాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. మొదటిరోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని ఆయన తెలిపారు.