22 March, 2026 | 2:45 AM

వేం నరేందర్‌రెడ్డికి అభినందలు తెలిపిన శ్రీనివాస్ గుప్తా

22-03-2026 01:18 AM

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని శనివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్తా మా ట్లాడుతూ వేం నరేందర్‌రెడ్డి  రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇకపై కూడా ప్రజా సేవలో మరింత చురుకుగా వ్యవహరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాలని కోరారు.