22 May, 2026 | 7:37 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సుబ్రమణియన్

30-01-2025 11:27 PM

థాయ్‌లాండ్ మాస్టర్స్

బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సుబ్రమణియన్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21 21 జాసన్ గునావన్ (హాంకాంగ్)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 42 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేయడం విశేషం. గతేడాది బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లోనూ గునావన్‌ను శ్రీకాంత్ ఓడించిన సంగతి తెలిసిందే. మరో సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సుబ్రమణియన్ 9 21 21 ఆరా వర్డొయో (ఇండోనేషియా)పై కష్టపడి నెగ్గాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ద్వయం రోహన్ కపూర్ రుత్విక క్వార్టర్స్‌కు చేరుకుంది.