24 May, 2026 | 10:22 PM

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ

24-05-2026 09:26 PM

ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్‌కు చెందిన అగ్రగామి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 13కి చేరింది. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత చేరువవడానికి ఈ విస్తరణ దోహదపడుతుంది.

పట్టణ విస్తరణ, మధ్యతరగతి కుటుంబాలలో అందుబాటు ధరల్లో ఇళ్లకు (అఫోర్డబుల్ హౌసింగ్) పెరుగుతున్న డిమాండ్ కారణంగా కడపలో నివాస గృహాల రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. సొంతిల్లు కొనుగోలు చేయాలనే ప్రజల ఆకాంక్షలు పెరుగుతుండటంతో, సులభంగా లభించే హౌసింగ్ ఫైనాన్స్ పరిష్కారాలకు ఇక్కడ మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ డిమాండ్ నేపథ్యంలో, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరళతరమైన హోమ్ లోన్ సేవలను అందించేందుకు కొత్త బ్రాంచ్ తోడ్పడనుంది.

ఏబీహెచ్ఎఫ్ఎల్ జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు (డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వారు), ఇతర వ్యాపారస్తులు మరియు కొత్తగా ఆదాయం ఆర్జిస్తున్న వర్గాల కోసం వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల గృహ రుణాలను అందిస్తోంది. తమకు ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన మార్కెట్ అనీ ,ఇక్కడ గృహ రుణాలకు ఉన్న బలమైన డిమాండ్, ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తూ, కస్టమర్లకు మరింత దగ్గరవ్వడానికి ప్రాంతీయంగా మా కార్యకలాపాలను విస్తరిస్తున్నామనీ,. కస్టమర్ల సొంతింటి కలను మరింత సులభంగా, వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాకారం చేయడమే మా లక్ష్యమని ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ శ్రీ పంకజ్ గాడ్గిల్ తెలిపారు.