యడారంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-03-2026 05:12 PM
బీబీపేట్,(విజయక్రాంతి): బీబీపేట్ మండలం యడారం గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోబ్బూరి సుధారాణి బాపురెడ్డి, టి. రఘునందన్ రావు, పి. తిరుమలరావు, డిఆర్డిఓ సిహెచ్ శ్రీనివాసరావు, సెర్ప్ స్టేట్ డైరెక్టర్ సిహెచ్ గోపాల్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ గొబ్బూరి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వరరావు, వెంకట్రావు, మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.




