వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో భక్తులకు వడపప్పు... బెల్లం పానకం అందజేత
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా చూడముచ్చటగా కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదమైన వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు), బెల్లం పానకంను శ్రీ వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ వారు వితరణ చేశారు, వేసవిలో శరీరానికి ఇది చలువచేస్తాయి.
ఆరోగ్యానికి చాలా మంచిది, తురిమిన బెల్లం నీళ్లు, యాలకుల పొడి, మిర్యాల పొడి , సొంటితో పానకం తయారు చేస్తారు.. నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు నిముషాలు తయారవుతాయి ఇవి శ్రీ సీత రామచంద్రునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలుగా భావిస్తారు. దీనిని భక్తులకు అందించడం ద్వారా వారి శరీరానికి శక్తిని ఇస్తుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ , ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.




