27 March, 2026 | 8:08 PM

కాంగ్రెస్ కౌన్సిలర్‌ను అరెస్ట్ చేయాలి... ప్రజాసంఘాల డిమాండ్

27-03-2026 06:48 PM

ప్రజా పాలన అంటే ప్రభుత్వ భూములే కబ్జానా ?

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ రజక సంఘం నాయకులైన కృష్ణ, రాజు పై దాడి చేసిన మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ మనప్పురం రాము చేసిన దాడిని ఖండిస్తూ అతడిని అరెస్టు చేయాలి అంటూ శుక్రవారం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో తమకు దోబీ ఘాట్ నిర్మించుకునేందుకు 45 ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం కలెక్టర్ ద్వారా భూమి అందించిందని అన్నారు.

ఈ భూమిని కబ్జా చేసుకునేందుకు 22వ వార్డు కౌన్సిలర్ దౌర్జన్యంగా చొరబడి కాంపౌండ్ వాల్ ను తొలగించారని అడ్డుకున్న రజక సంఘం నాయకులపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు అణగారిన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ,టీజేఎస్ నాయకులు సోమశేఖర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ కుమార్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వాహబ్, రజక సంఘం పట్టణ శాఖ అధ్యక్షులు రాజు నాయకులు శాంతి కుమార్, పెంటప్ప, బిచ్చప్ప, రాజు, సురేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.