వైద్యుడుపై దాడి చేసే వారిని శిక్షించాలి
27-03-2026 06:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఎల్ ఆర్ పిల్లల వైద్యులు సంతోష్ రాజ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీలు నిరసన తెలిపారు. నిర్మల్ రూలర్ సోన్ కుంటాల దిల్వార్పూర్ తదితర మండలాలు ఆర్ఎంపి వైద్యులు నల్లబ్యాడ్జిలు ధరించి హానిక పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీలు పోశెట్టి రమేష్ జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.




