శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని
సనత్‌నగర్, (విజయ క్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పల్లకిని మోశారు. సనత్ నగర్ లోని 7 టెంపుల్స్ లో స్వామి వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలను సమర్పించారు.
పద్మారావు నగర్, బన్సీలాల్ పేట
పద్మారావు నగర్ లోని పోల్ బాల్ హనుమాన్ టెంపుల్, ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతా రామాంజనేయ ఆలయంలను దర్శించుకుని శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లకిని మోస్తూ మండపం వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అదేవిధంగా IDH కాలనీ, D క్లాస్, మెట్ల బావి వద్ద గల ఎర్ర పోచమ్మ దేవాలయం, అరుణ్ జ్యోతి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం లలో నిర్వహించిన కళ్యాణం, పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్, కుమార్ యాదవ్, లక్ష్మీపతి, కొత్తూరు వెంకట్, గజ్జెల శ్రీనివాస్, అబ్బాస్, ముక్కా శ్రీనివాస్, అనిత, నాగలక్ష్మి, శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాంగోపాల్ పేట
రాంగోపాల్ పేట డివిజన్ లోని జీరాలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీ బాలాజీ మందిర్, విక్టోరియా గంజ్ కమిటీ హాల్, PG రోడ్ లోని కృష్ణానగర్ లలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కిషోర్, వెంకట్ బాబు, సతీష్, గణేష్, అరుణ్ భట్, ప్రవీణ్, సంజయ్ తదితరులు ఉన్నారు.
బేగంపేట డివిజన్
బేగంపేట డివిజన్ లోని కేసరి హనుమాన్ టెంపుల్, భగవంతా పూర్, ప్రకాష్ నగర్ లోని మహావీర్ ఎమ్ రాల్డ్ అపార్ట్మెంట్ లలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ నాయి, శేఖర్, ఆరీఫ్, శ్యామ్, నాగరాజు తదితరులు ఉన్నారు.
సనత్ నగర్ డివిజన్
సనత్ నగర్ లోని 7 టెంపుల్స్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వదించారు. అనంతరం జెక్ కాలనీలో, భగత్ సింగ్ పార్క్, C టైప్ క్వార్టర్స్, రవీంద్ర నగర్, ఉదయ్ నగర్ కమిటీ హాల్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఖలీల్, గోపిలాల్ చౌహాన్, జమీర్, అర్జున్ గౌడ్ తదితరులు ఉన్నారు.
అమీర్ పేట
అమీర్ పేట డివిజన్ లోని ధరం కరం రోడ్డు లో గల ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, వనం శ్రీనివాస్, ప్రదీప్ గౌడ్ తదితరులు ఉన్నారు.




