27 March, 2026 | 8:46 PM

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

27-03-2026 07:00 PM

- భక్తులతో కిటకిటలాడిన రాములోరి ఆలయం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని సీతారామ హనుమ సమేత రామాలయంలో కోదండ రాముని కళ్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నుల విందుగా జరిగింది.ఈ పవిత్ర వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఆలయ వ్యవస్థాపకులు చల్మెడ ఆనందరావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, వారి సతీమణి సునీల దంపతుల సమక్షంలో అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య పునర్వసు నక్షత్రంలో రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రామనామ స్మరణతో ఆలయం అంతా మార్మోగింది.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ వ్యవస్థాపకులు, మల్కపేట గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. కళ్యాణం దర్శించిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.