22 April, 2026 | 2:48 AM

జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య డబల్ రికార్డ్

22-04-2026 01:53 AM

అత్యధిక ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీచైతన్య సంచలన రికార్డ్ సృష్టించింది. ఇద్దరికి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరిలో రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌లు బీవీసీ శేఖర్‌రెడ్డి(హాల్ టికెట్ నెం.260310787719), మరో విద్యార్థికి 300కి 300 మార్కులతో ఆలిండియా ఓపెన్ కేటగిరిలో ఫస్ట్ ర్యాంక్ పసల మోహిత్(హాల్ టికెట్ నెం.260310432915) తో పాటు, ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 8వ ర్యాంక్ ఆరుష్ సింఘాల్(హాల్ టికెట్ నెం.260310004785), 11వ ర్యాంక్ యశ్వర్థన్(హాల్ టికెట్ నెం.260310789985 డీఎల్‌పీ/ఏఐటీఎస్) 15వ ర్యాంక్ జేఆర్ మణిదీప్‌రెడ్డి(హాల్ టికెట్ నెం.260310031278) తో ఆలిండియా ఓపెన్ కేటగిరిలో టాప్ 10లోపు 3ర్యాంకులతో పాటు, 100లోపు, వెయ్యిలోపు గత సంవత్సరం కంటే అత్యధిక ర్యాంక్‌లు శ్రీచైతన్య విద్యార్థులే సాధించి రికార్డ్ సృష్టించింది శ్రీచైతన్య.

శ్రీ చైతన్య అకాడమీ ఏఐఆర్ 98, 107, 396, 826 వంటి టాప్ ర్యాంక్‌లను సాధించింది. అలాగే శ్రీ చైతన్య అకాడమీ బెంగళూరు విద్యార్థి నిశాంక్ వ్యాస్ ఏఐఆర్ 396వ ర్యాంక్ సాధించాడు.ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమి డైరెక్టర్ సుష్మ బొప్పన మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా జేఈఈ మెయిన్‌లో వరుసగా 300/300 మార్కులు సాధిస్తూ హ్యాట్రిక్ రికార్డు సృష్టించడం ఒక్క శ్రీచైతన్యకే సాధ్యమైంది.

శ్రీచైతన్య అందించే మైక్రో షెడ్యూల్స్, నిరంతం ఇంటర్నల్ ఎగ్జామ్స్, దేశంలోని అత్యుత్తమ ఫ్యాక్టల్టీ, మా అధునాతన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ విజయానికి వెన్నెముకగా నిలిచాయి అని హర్షం వ్యక్తం చేశారు. శ్రీచైతన్య విజయ ప్రస్థానంలో ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌లైన్ యాప్ కీలక పాత్ర పోషించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యున్నత సాంకేతికతతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్, విద్యార్థులకు వ్యక్తిగత విశ్లేషణలు, మెరుగైన అభ్యాసన అనుభవాన్ని అందిస్తూ వారిని జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతోంది.  తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీచైతన్య అభినందలు తెలియజేసింది.