అన్నమలైతో పద్మ వీరపనేని భేటీ
22-04-2026 01:53 AM
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): తమిళనాడు ఎన్నికల ప్రచార వ్యూహాలపై బీజేపీ మహిళామోర్చా జాతీయ నాయకురాలు, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని గారు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఆమె బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ అన్నమలై గారిని కలిసి కీలక చర్చలు జరిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించేలా రూపొందించిన ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.






