16 August, 2026 | 2:32 AM

మిసెస్ తెలంగాణ రితు అగర్వాల్

16-08-2026 12:55 AM

లక్మికా గోల్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్

హైదరాబాద్, ఆగస్టు 1౫(విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయే ట్ రితు అగర్వాల్ ప్రతిష్ఠాత్మక మిస్ సౌత్ ఇండియా అండ్ మిసెస్ సౌత్ ఇండియా 2026 పేజెంట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి రీజినల్ టైటిల్ మిసెస్ తెలంగాణ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. కొచ్చిలో నిర్వహించిన ఈ పోటీల్లో రితు అగర్వాల్ సాధించిన విజయం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవా రం రితు అగర్వాల్‌ను ఘనంగా సత్కరించేందుకు లక్మికా గోల్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యం లో బంజారాహిల్స్‌లోని లక్మికా జువెల్లర్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రితు అగర్వాల్ విజయాన్ని అభినం దిస్తూ ఆమెను ఘనంగా సత్కరించారు.

లక్మి కా గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ శారద, గ్లామోరా వ్యవస్థాపకురాలు హెచ్. కవిత పాల్గొని రితు అగర్వాల్‌ను స న్మానించి, ఆమె విజయానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మిస్ ఆసియా ఇంటర్నేషనల్ అండ్ తెలంగాణ ఇకత్ బ్రాం డ్ అంబాసిడర్  రష్మి ఠాకూర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రితు అగర్వాల్ పేజెం ట్ ప్రయాణంలో రష్మి ఠాకూర్ మెంటర్‌గా వ్యవహరిస్తూ ఆమెకు మార్గదర్శనం, ప్రోత్సా హం అందిస్తున్నారు. రితు అగర్వాల్ మాట్లాడుతూ, ఈ కిరీటం నాది మాత్రమే కాదు.

తమ కలలకు గడువు లేదని నమ్మే ప్రతి మహిళకు ఇది చెందుతుంది అన్నారు. నేను సాధించగలిగితే మీరు కూడా సాధించగలరు. సక్సెస్ మీట్ నిర్వహించిన లక్మికా గోల్ అండ్ డైమండ్స్‌కు నా హృదయపూర్వక కృ తజ్ఞతలు అని తెలిపారు. పెగాసస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కొచ్చిలో మిస్ సౌత్ ఇండియా అండ్ మిసెస్ సౌత్ ఇండియా 2026 పేజెంట్‌ను నిర్వహించారు. పెగాసస్ ఈవెంట్స్ మే నేజింగ్ డైరెక్టర్లు మిస్టర్ అజిత్ రవి, జబితా జానీ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. యూనిక్ మ్యాగజైన్, డీక్యూ వాచెస్ స్పాన్సర్లుగా, మణప్పురం గోల్ ఫైనాన్స్ టైటిల్ స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. లీ మెరిడియన్, సాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ హాస్పిటాలిటీ పార్టనర్లుగా, పరకట్ జువెల్లర్స్ క్రౌన్ జువెల్లరీ పార్టనర్‌గా వ్యవహరించారు.