16 August, 2026 | 2:33 AM

విజ్ఞాన్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

16-08-2026 12:57 AM
  1. లీయోకేర్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ రూపకల్పన
  2. ప్రశంసించిన ఫౌండేషన్ నిర్వాహకులు, వర్సిటీ యాజమాన్యం

హైదరాబాద్, ఆగస్టు 1౫(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పో చంపల్లి మండలం, దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులు సాంకేతిక రంగంలో తమ ప్రతిభను చాటుకున్నా రు. కేవలం తరగతి గది చదువులకే పరిమి తం కాకుండా, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘లీయోకేర్ ఫౌండేషన్’కి సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక వెబ్‌సైట్‌ను అత్యంత ప్రతిభావంతంగా రూపొందించారు.

బీటెక్ సీఎ స్‌ఈ మూడో సంవత్సరం విద్యార్థి బి. శ్రావ ణ్ కుమార్ గౌడ్, బీటెక్ ఏఐఎమ్‌ఎల్ మూ డో సంవత్సరం విద్యార్థి సీహెచ్ హేమంత్ సాయి ఈ వెబ్‌సైట్ డిజైన్ చేశారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్ర మంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావుతో కలిసి, లీయోకేర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈవో దుర్గా పద్మలత ఈ వెబ్‌సైట్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గా పద్మలత మాట్లాడుతూ డిజిటల్ యుగంలో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. తమ ఫౌండేషన్ కోసం విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన వెబ్‌సైట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందని ప్రశంసించారు.

ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు నేర్చు కున్న జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ అవసరాలకు అన్వయించి, ఆలోచనలకు ఆచరణ రూ పం ఇచ్చినప్పుడే విద్యకు సార్థకత లభిస్తుందన్నారు. లీయోకేర్ ఫౌండేషన్ వంటి సంస్థ కు డిజిటల్ పరిష్కారం చూపడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలకు మించి విలువైన అనుభవాన్ని, టీమ్‌వర్క్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను సాధించారని పేర్కొన్నారు.

ఈ ప్రా జెక్టుకు సీఎస్‌ఈ విభాగానికి చెందిన అసిస్టెం ట్ ప్రొఫెసర్ సామ రంజిత్ కుమార్, టీఏ కె. ప్రణవ్ రెడ్డి మెంటార్లుగా వ్యవహరించారు. లీయోకేర్ ఫౌండేషన్ ప్రతినిధులు శాలువాలు, జ్ఞాపికలు, ప్రశంసా ప త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వివిధ విభాగాధిపతులు, అధ్యాపక బృందం, లీయోకేర్ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.