హిల్ట్ పేరుతో భూములకు ఎసరు
- ఉచిత బియ్యానికి 90% నిధులు కేంద్రానివే
- రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు?
- ఎంఐఎంకు వందేమాతరమంటే అవమానమా?
- విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్ అండ
- స్వాతంత్య్ర వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : హిల్ట్ పాలసీ పేరుతో రియట్ ఎస్టేట్ బడా బాబులకు వేలాది ఎకరాల విలువైన భూ ములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచం దర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతం త్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ కర్ణాటక--తమిళనాడు కో -ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజే పీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు, వేముల అశోక్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భూము ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రియల్ ఎస్టేట్ వ్యాపారు లకు అనుకూలించేలా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రం పంపిణీ చేసే రేషన్ బియ్యానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని, స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోవడం ప్రజలను వంచించడమేనన్నారు.
గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నేతృత్వం లో దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సా ధించిందని, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొని యాడారు. ఐటీ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రం గంలో స్వదేశీ యుద్ధ విమానాలను స్వయం గా తయారు చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. ఒకప్పుడు దేశంలో కేవలం ఆరు ఐ ఐటీలు ఉంటే, నేడు 20కి చేరాయన్నారు.
వీటితో పాటు ఎయిమ్స్, ఐఐఎంలు, ఎన్‌ఐటీ ల సంఖ్య పెరిగిందన్నారు. యువతను ఉద్యోగాలు కోరేవారిగా మాత్రమే కాకుండా, ఉ ద్యోగాలు కల్పించే స్థాయికి చేర్చేందుకు స్టార్ట ప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర పథకాల ద్వారా కేం ద్రం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరు ల ఆదర్శాలతో యువత ముం దుకు సాగాలని కోరారు.
విశ్వవిద్యాలయా ల్లో కశ్మీర్ ఆ జాదీ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చే విచ్ఛిన్నకర శక్తులకు, పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లా డే శక్తులకు కాంగ్రెస్ పార్టీ మ ద్దతు పలకడం సిగ్గుచేటని రాంచందర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నాటి నుంచే బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షి ణాది, ఉత్తరాది పేరుతో దే శాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. విపక్ష కూటమి పాలనలో ఉన్న ఝా ర్ఖండ్‌లో వే లాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి 12 రోజులుగా న్యాయం కోసం పో రాడుతుంటే ఈ కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు ఎందు కు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 4.5 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ. 2 లక్షల కో ట్లకు పైగా భారం మోపి అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలను, బీసీ రిజర్వేషన్ల హామీలను కాంగ్రెస్ తుంగ లో తొక్కిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకపోగా, విద్యార్థులకు రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్ల విభజన పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని వివరిం చారు.
సమ్మక్క--సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధు నీకరణ, రైల్వేస్టేషన్ల మోడ్రనైజేషన్, కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్, రామగుండం ఫెర్టిలైజర్స్ పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎంఎంటీఎస్ విస్తరణ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను మోదీ ప్రభు త్వం తెలంగాణకు అందించిందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
దేశ రక్షణ అందరి బాధ్యత
గతంలో ఉగ్రవాద దాడులు జరిగినా పట్టించుకోని పరిస్థితులు ఉండేవని, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి పాక్ లోని ఉగ్రస్థావరాల పై దాడులు చేసి గట్టి ప్రతీకారం తీర్చుకున్నామని రాంచందర్ రా వు పేర్కొన్నారు. దేశానికి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ‘హమ్ కరేంగే.. హమ్ కరేంగే’ నినాదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
‘అగర్ భారత్ మే రహనా హోగా.. తో వందేమాతరం కహనా హోగా’ అనే జా తీయ భావనతో ప్రతి పౌరు డూ నిలబడాలని ఉద్ఘాటించారు. వందేమాతరం గేయం ఆలపిస్తుంటే కూర్చుని అవమానించే మజ్లిస్ నాయకుల తీరును సమాజం అసహ్యించుకుంటుందన్నారు. దేశ స్వాభిమానాన్ని దెబ్బ తీసే చర్యలను, భారతావనిపై చేసే అనుచిత వ్యాఖ్యలను బీజేపీ సహించబోదని హెచ్చరించారు. దేశ వ్యతిరేక శక్తులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.






