3 July, 2026 | 9:54 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నీట్ ఆలిండియా మొదటి ర్యాంకు శ్రీచైతన్యదే

15-06-2025 01:29 AM

ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన శ్రీచైతన్య

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, అన్ని ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది. ఆలిండియా 1వ ర్యాంక్ కావి ష్ (జనర్) (హ.నం: 250411147966), దివ్య (ఎస్సీ) 5వ ర్యాంక్  (హ.నం: 250410401431), మహ్మద్ సమీర్ 6వ ర్యాంక్ (ఓబీసీ) (హ.నం. 250410822821), బీ ధీరజ్‌కుమార్ (ఎస్టీ) 8వ ర్యాంక్ (హ.నం.: 250410546302), మరి వరుణ్ 10వ ర్యాంకు (ఓబీసీఎన్‌సీఎల్) (హ.నం.: 250410102078), ఆలిం డియా టాప్ 10లోపు 5 ర్యాంకులు శ్రీచైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థులే.

ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ.. నాణ్యమైన శిక్షణను అందిస్తూ, అనితరసాధ్యమైన ప్రోగ్రాములు, మైక్రోషెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్, దేశంలోనే టాప్ ఫ్యాక్టల్టీ కారణంగానే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆలిండియా ఓపెన్ క్యాటగిరిలో 100 లోపు అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇన్ఫినిటీ లెర్న్ టెక్నాలజీ సహాయంతో అందించిన అత్యుత్తమ శిక్షణ వల్ల మా లాంగ్ టర్మ్ విద్యార్థులు కూడా అత్యధిక సంఖ్యలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. నీట్ 2026కు సరికొత్త ఏఐ టెక్నాలజీతో లాంగ్ టర్మ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని ఆమె అభినందించారు.