12 May, 2026 | 8:30 PM

Breaking News

వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •  

ఇల్లందులో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ ప్రారంభం

12-05-2026 07:11 PM

అత్యాధునిక బోధనతో ఐఐటి, నీట్ ప్రత్యేక శిక్షణ

ఇల్లందు,(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందులో గతంలో ఎన్నడు లేని విధంగా పట్టణంలో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించినట్లు అకాడమీ ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఐఐటి, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో బోధన సాగుతుందని తెలిపారు. హాస్టల్ సౌకర్యం, ప్రత్యేక స్టడీ మెటీరియల్, ప్రతి విద్యార్థిపై నిరంతర పర్యవేక్షణ, వారాంత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించే లక్ష్యంతో అకాడమీని ప్రారంభిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.