కోసు పటేల్‌గూడలో వరకట్నం, ఆడంబర పెళ్లిళ్లకు నిషేధం
సామూహికంగా ముందుకొచ్చిన గ్రామస్తులు
వరుడికి రూ.20 వేల సాయం
సిరికొండ,(విజయక్రాంతి): మండలంలోని కోసు పటేల్‌గూడ గ్రామంలో సామాజిక సంస్కరణలకు నాంది పలుకుతూ గ్రామస్తులు వరకట్నం, ఆడంబరమైన పెళ్లిళ్లను పూర్తిగా నిషేధించారు. భారమైన ఖర్చులు, అప్రయోజక ఆచారాలకు ముగింపు పలుకుతూ గ్రామం మొత్తం ఏకతాటిపైకి రావడం విశేషం. వివాహాలను సాదాసీదాగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
గ్రామస్తుల సహకారంతో వరుడు తోడసం వసంత్‌రావ్ వివాహానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కుంరం రావుజీ, దేవరి కుంరం జంగుబాపు, మహాజన్ కొరెంగ వాగు, కర్భారి కుంరం కోసేరావ్, సిరికొండ మండల తుడుం దెబ్బ అధ్యక్షుడు కుంరం యాదోరావ్, పెందుర్ లక్ష్మణ్, పెందుర్ లింబరావ్, పెందుర్ చందు, పెందుర్ జంగు, పెందుర్ మారుతి, పెందుర్ సూర్యబాన్, కుంరం జరుబాయి, కుంరం లలిత, కొరెంగ బాగుబాయి, కుంరం గోదావరి, కుంరం సుగుణబాయి తదితరులు పాల్గొన్నారు.






