13 April, 2026 | 5:13 AM

ఎస్‌ఆర్ విద్యార్థుల హవా

13-04-2026 03:28 AM

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో విజయభేరి

హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు తమ సత్తాచాటారు.ఎంపీసీ విభాగంలో ఎ. శ్రీయుక్త(హాల్‌టికెట్ నెం.2635108745) 470కిగానూ 469 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో జే మహ(హాల్ టికెట్ నెం.2635118928) 440కిగాను 439 మా ర్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో శ్వేతకుమారి(హాల్ టికెట్ నెం.26591246 20) 500కుగాను 496 మార్కులు సాధించారు.

దివ్య కచ్వ(హాల్ టికెట్ నెం.2659116 717) 496 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో ఇ.శివలత(హాల్ టికెట్ నెం.26591289943) 500కుగాను 494 మార్కులు సాధించారు. అలాగే సుబియ పర్విన్(హాల్ టికెట్ నెం.2660107131) 500కు గాను 494 మార్కులు సాధించారు.

విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భవిష్యత్‌లో మరింత అత్యుతమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు. ప్రతి సంవతరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఈ సంవత్సరం ఐపీఈలో కూడా విశిష్టమైన మార్కులు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.