12-02-2026 07:44:13 PM
మోతె,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతలలో క్రీడలు మానసిక వికాసం శారీరకంగా దృఢత్వం కలిగిస్తాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, విభాలపురం గ్రామల లో ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడలు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కొరవి నాగమణి వీరాస్వామి, గుండ్ల చంద్రకళ, గుండ్ల లక్ష్మారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు జానీ పాషా, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత మహమ్మద్ జానీ మియా, సైదులు, గంగరాజు, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.