సాయి సుదర్శన్ సెంచరీ
ధీటుగా జవాబిస్తున్న భారత్ ఏ
శ్రీలంకతో రెండో అనధికార టెస్ట్
గాలే, జూలై 3: శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత్ పుం జుకుంది. రెండోరోజు బౌలర్లు చెలరేగి లంక ను కట్టడి చేస్తే.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. దీంతో లంక జ ట్టుకు భారత్ ఏ ధీటుగా జవాబిస్తోంది. తొలి రోజు నిరాశ పరిచిన భారత బౌలర్లు రెండో రోజు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకే లంకను ఆలౌట్ చేశారు. తొలి సెషన్‌లో గుర్నూర్ బ్రార్, సరాన్ష్ జైన్ చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధి లో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.
లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే 127 పరుగులకు ఔటయ్యాడు. భారత బౌలర్లలో బ్రార్ 4, సరా న్ష్ 4, యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. తర్వా త తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, అమోన్ మోంఖ డే 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. అమోన్ ఔటైనా సాయి సుదర్శన్, పడిక్కల్ లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరి చారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ సెం చరీ పూర్తి చేసుకున్నాడు. అటు పడిక్కల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రెండోరోజు భారత్ 247/1 స్కోరుతో ము గించింది. సాయి సుదర్శన్ 104, పడిక్కల్ 94 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 119 రన్స్ వెనుకబడి ఉంది.






