దూసుకొచ్చిన బస్సు.. విద్యార్థి మృతి
చేవెళ్ళ మున్సిపల్ షాబాద్ చౌరస్తాలో ఘటన
చేవెళ్ళ జులై 1(విజయక్రాంతి): కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తు న్న విద్యార్థి పైకి ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి న ఘటనలో ఓ వి ద్యార్థి మృతి చెందాడు. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన శేరి కృష్ణా రెడ్డి కొడుకు సాత్విక్ రెడ్డి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వామి నారాయణ్ గురుకుల్ లో ఇంటర్ చదువుతున్నాడు.
రోజు మాదిరిగా తన స్వగ్రామమైన కందవాడ నుండి కళాశాలకు వెల్లెందుకు చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని షాబాద్ చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా... ఉదయం సమయం 7.30 గంటల ప్రాంతంలో తాండూర్ డిపోకు చెందిన ఆర్ టీసీ బస్ నెం. TS-09-Z-8119 నడుపుతున్న బస్సు సాత్విక్ రెడ్డి మీదికి దూసుకెళ్లి పక్కనే ఉన్న ఆల్టో కార్ను ఢీ కొట్టినది. ఈ ప్రమాదంలో సాత్విక్ రెడ్డి తల శరీర భాగాలకు బలమైన రక్త గాయాలై అక్కడికక్కడే చనిపోయినాడు. ఈ ప్రమాదంలో ఆల్టో కారు ఎడమవైపున పూర్తిగా డ్యామేజ్ అయినది. ఈ ప్రమాద ఘటనపై మృతుని తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు.






