20 June, 2026 | 1:21 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శిక్షణ

20-06-2026 12:07 AM

24 మంది కానిస్టేబుళ్లకు ధృవపత్రాలు అందజేత

రాజేంద్రనగర్, జూన్ 19 (విజయక్రాం తి):  రోడ్డు ప్రమాదాల నివారణ, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, ప్రమాద బాధి తులకు తక్షణ సహాయ సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ అకాడమీ  ఆధ్వర్యంలో నిర్వహించిన విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్కు చెందిన సిటీ ఆరమ్డ్ రిజర్వ్  విభా గంలోని 24 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు జూన్ 8 నుండి 19 వరకు పది రోజుల పా టు ఈ ప్రత్యేక శిక్షణ అందించారు.

రోడ్డు ప్ర మాదాల సందర్భాల్లో స్థానిక దర్యాప్తు అధికారులకు సహకరించడం, ప్రమాద బాధి తులకు సత్వర సహాయం అందించడం, ప్రమాదాలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును రూపొందించారు. శిక్షణలో భాగంగా కేసు నమోదు నుంచి చార్జ్షీట్ దాఖలు వరకు అనుసరించాల్సిన విధానాలు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సాక్ష్యాధారాల సేకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు వాటి పంపిణీ, ప్రమాద బాధితుల కు రక్షణ, వైద్య సహాయం, డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై సైద్ధాంతిక, ప్రాయోగిక శిక్షణ అందించారు.

అదేవిధంగా మోటార్ వాహనాల చట్టం  ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు, తెలంగాణ పోలీస్ శాఖ వినియోగిస్తున్న  అత్యవసర స్పందన విధానాలపై ప్రత్యేక పాఠాలు నిర్వహించారు. ఈ శిక్షణలో సీనియర్ డీఎస్పీ స్థాయి అధికారులు, న్యాయ నిపుణులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు, వైద్య నిపుణులు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షకులు పాల్గొని శిక్షణ అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక చొరవతో ఈ కోర్సు నిర్వహించగా, కోర్సు డైరెక్టర్గా సీనియర్ డీఎస్పీ సతీష్ కుమార్, కో-ఆర్డినేటర్గా డీఎస్పీ పి. జ్ఞానేంద్ర రెడ్డి వ్యవహరించారు.

శిక్షణ ప్రారంభోత్సవానికి అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కవిత హాజరై శిక్షణ ప్రాముఖ్యతను వివరించగా, ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ఆధునిక ట్రాఫిక్ నిర్వహణలో ఈ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాల అవసరాన్ని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన 24 మంది కానిస్టేబుళ్లకు ధృవపత్రాలు అందజేసి అభినందించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సమర్థ ట్రాఫిక్ నిర్వహణలో ఈ శిక్షణ పొందిన సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.