శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
13-08-2026 08:17 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయం శ్రీ రంగనాయక స్వామి హనుమాన్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభోత్సవం సందర్భంగా శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుదత్ భక్తులతో అభిషేకం, బిల్వర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాగభూషణ్ గౌడ్, దంపతులు, భక్తులు పాల్గొన్నారు.






