శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మృగశిర కార్తె సందర్భంగా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో గల శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,ఎనడ్ల రాములు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు భక్తిమయ వాతావరణంలో సాగగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.






