ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష
31-07-2026 11:18 AM
ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలు తప్పక సాధించాలి
హైదరాబాద్: ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao ) శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలపై చర్చించారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనుల పురోగతిపై అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలు తప్పక సాధించాలని తుమ్మలు సూచించారు.






