31 July, 2026 | 11:54 AM

పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు

31-07-2026 10:59 AM

ముకరంపుర, జూలై 31(విజయక్రాంతి): పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని ఓసి జేఏసీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావు అన్నారు. శుక్రవారం హన్మకొండ లో సమాఖ్య కార్యాలయంలో కీ. శే.పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తదితరులతో కలిసి గోపు జైపాల్ రెడ్డి,పోలాడి రామారావు లు నివాళులు అర్పించి మాట్లాడుతూ... సౌమ్యుడిగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి మమ్ములను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్ర సమాజానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ఆయన శాసన సభ్యుడిగా ప్రాతినిద్యం వహించిన నర్సంపేట పేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు.