8 June, 2026 | 5:44 PM

ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ

08-06-2026 04:20 PM

రుద్రంగి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముదిరాజ్ సంఘ సభ్యులు తమ మామిడి తోటకు బోర్ మోటార్ కావాలని కోరగా స్పందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బోర్ మోటార్ మంజూరు చేయడం జరిగింది. అట్టి ప్రొసీడింగ్ కాపీని ఈ రోజు స్థానిక సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ముదిరాజ్ సంఘ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సంఘానికి సంబంధించిన మామిడి తోట నిరులేక ఎండిపోతుందని బోర్ మోటార్ అవసరమని చెప్పిన వెంటనే నూతన బోర్ మోటార్ మంజూరు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి బోర్ మోటార్ మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ముదిరాజ్ సంఘ సభ్యులం ఎల్లవేళలా ఋణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు.